
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 2, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి)ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల స్వతంత్ర అభ్యర్థిగా జీవి సుందర్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని సుందర్ తండ్రి అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ సోమవారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.ఈ సందర్భంగా హర్ష కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత, గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసే హామీలు ఇచ్చాయన్నారు. తాను తొలి నాటి నుంచి అన్యాయాన్ని ప్రశ్నించేతత్వం ఉండడంతో తన రెండవ కుమారుడు సుందర్ను పట్టబద్రుల స్థానానికి పోటీలో నిలిపానన్నారు. ప్రజలు, పట్టభద్రుల తరపున సమస్యలను సుందర్ మండలిలో తన వాణిని వినిపిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా అభ్యర్థి జీవి సుందర్ మాట్లాడుతూ తన ముందు పని చేసిన వారి గురించి తెలుసుకున్నానని వారు ఉద్యోగ సమస్యలపైనే మాట్లాడారే తప్పా పట్టభద్రుల గురించి ప్రస్తావించలేదన్నారు. తాను సొంతంగా పట్టభద్రులకు ఉపయోగపడే మేనిఫెస్టోను తయారు చేసుకున్నానని విద్యా, ఉపాధి, హామీలపై దృష్టి సారిస్తానన్నారు. త్వరలోనే నామినేషన్ వేస్తారని సుందర్ చెప్పారు. ఇంతకుముందు సీఎంలు పనిచేసిన చంద్రబాబు, జగన్ ఇద్దరు నిరుద్యోగులను, పట్టభద్రులను మోసం చేశారన్నారు. తనను గెలిపించాలని సుందర్ అభ్యర్థించారు. అనంతరం మేనిఫెస్టో కాపీని విడుదల చేశారు.ఈ సమావేశంలో ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు తాళ్లూరు రాజు, నాయకులు బొజ్జా ఐశ్వర్య, నేతల హరిబాబు, కాశీ లక్ష్మణ్ స్వామి తదితరులు పాల్గొన్నారు