
డిజి.పోలప్ప
భారత నాస్తిక సమాజం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.
పయనించే సూర్యుడు//న్యూస్// ఫిబ్రవరి4 మక్తల్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి గత 32 ఏళ్లుగా జాతీయ నాస్తిక మేళాను నిర్వహించడం ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని ఎత్తిపడుతూ దేశంలో నాస్తిక ఉద్యమానికి పునాదులు వేయడంతో పాటు, సాహిత్య సంస్కృతిక రంగాలలో విశేష కృషిని అందిస్తున్నది.
ఈ క్రమంలో ప్రతి సంవత్సరం దేశంలోని నాస్తిక ప్రజలందరూ మరింత శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం కోసం ఈ సమ్మేళనాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నాము. చార్వాకులు, లోకాయుతుల తో మొదలుకుంటే ఈ కోవలో అనేక మంది మతోన్మాదానికి బలవుతున్నారు. శాస్త్రీయ సైంటిఫిక్ టెంపర్ ను సైన్స్ ను పెంపొందిస్తూ, మూడో విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరము ఉన్నది.ప్రపంచ దేశాలు శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచాన్ని జయిస్తుంటే,మన దేశం మాత్రం మత మౌడ్యంతో సైన్స్ ను అణచివేసే పద్ధతులు కొనసాగుతున్నాయి.కనుక .మతాలన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచి గెలుచును.అని అన్న గురజాడతో.మొదలుకుంటే అనేకమంది కవులు ఈ దేశంలో అంద విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచారు. ఈ కోవలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరి లో దేశంలోనే మొట్టమొదటిసారిగా నాస్తిక పాఠశాలలు పెట్టడంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో నాస్తి ఉద్యమానికి బీజాలు వేస్తూ,ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర చార్వాక రామకృష్ణ కి ఉన్నది. కావున ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రొఫెసర్లు.గుంటూరు జిల్లా మంగళగిరి చార్వాకాశ్రమంలో ఈనెల 8, 9 తేదీలలో జరిగే 33 వ జాతీయ నాస్తిక మేళాకు హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో.భారత నాస్తిక సమాజం రాష్ట్ర కమిటీ సభ్యులు డీజీ పోలప్ప, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు పృథ్వీరాజ్, రవికుమార్,మద్దిలేటి, అంబేద్కర్ యువజన సంఘం, ఉపాధ్యక్షులు బండారి వెంకటేష్, అంబేద్కర్ యువజన సంఘం ఉప్పార్పల్లి అధ్యక్షులు బాలకృష్ణ,అక్షయ్ కుమార్ తేజ, శ్రీహరి,రమేష్,కృష్ణ పెయింటర్ తదితరులు పాల్గొన్నారు.