
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 6. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం 2005 అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది.
కార్యాలయాల్లో బదిలీ అయిన అధికారుల పేర్లు, మరికొన్ని కార్యాలయాల్లో అధికార పేర్లు లేకుండానే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం 2005 ప్రవేశ పెట్టడం జరిగింది అయినా గాని సమాచార హక్కు చట్టం 2005 కమిషనర్ లను నియమించకపోవడం ప్రమాదంగా మారే అవకాశం ఉంది సమాచార సమాచార హక్కు చట్టం 2005 కమిషనర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తున్నాము సమాచార హక్కు చట్టం 2005 ద్వారా దరఖాస్తు చేసుకున్న తరువాత సమాచారం ఇవ్వకపోవడంతో ఫిర్యాదులు చేసిన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదు వారి యొక్క నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది. సమాచారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే ఎవరికి దరఖాస్తు అందజేయాల్లో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయంలో దరఖాస్తు చేసినప్పటికీ గాని అధికారులకు ఎటువంటి సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు చాప కింద నీరు ల అధికారులు ప్రవర్తిస్తున్నారు ప్రభుత్వ ధనాన్ని గండి కొట్టడం వాటికి సంబంధించిన రికార్డులు రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం కూడా కొన్ని కార్యాలయాల్లో అవకతవలు కూడా చాలా మటుకు జరిగాయని ప్రజల్లో గుసగుసలు ఉన్నప్పటికీ ఉన్నత జిల్లా అధికారులు కూడా పట్టించుకోకపోవడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అని సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్టు సొసైటీ అధ్యక్షులుగుగులోత్ భావుసింగ్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడు ప్రశ్నించే విధంగా తమ హక్కులను కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరు తయారు అవ్వాలని ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది