
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ తొలి సమావేశం నిర్వహించిన చైర్మన్ వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 8 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావాత్ నరేందర్ నాయక్ )➖ ఈరోజు హైదరాబాద్ లోని అసెంబ్లీ లో ప్రభుత్వ సంస్థల కమిటీ తొలి సమావేశం ను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎనర్జీ ప్రిన్సిపుల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ యన్.బలరామ్ , తెలంగాణ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్), మాధవి,అసెంబ్లీ సెక్రటరీ నరసింహ చార్యులు,కమిటీ సభ్యులు మక్కాన్ సింగ్ ఠాగూర్, సంజీవ రెడ్డి, తాత మధు,మీర్జా రియాజ్ ఉల్ హాసన్ ఎఫెండి, తోట లక్ష్మీ కాంత రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…సింగరేణి దేశ,రాష్ట్ర ప్రగతిలో కీలకం అని పేర్కొన్నారు.సింగరేణి లాభాల బాటలో పయనిస్తూ అత్యధిక లాభాలను నమోదు చేయటం శుభపరిణామం అని తెలిపారు.గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర లాభాలు రూ.4,701 కోట్లు కాగా ఇందులో రూ.2,412 కోట్లలో 33 శాతం కింద రూ.796 కోట్లను కార్మికులకు పంచడం హర్షించదగ్గ విషయం అని పేర్కొన్నారు.సింగరేణి ప్రాంతాల్లో అభివృద్ధి కోసం డీ.ఎం.ఎఫ్.టీ నిధులను, సి.ఎస్.ఆర్ నిధులను ప్రణాళిక బద్దంగా వాడుకోవాలని చెప్పారు.అలాగే సింగరేణి ఉద్యోగుల కోసం క్రమం తప్పకుండా మెడికల్ బోర్డు ను పెట్టాలని కోరారు.అలాగే మెడికల్ బోర్డు లో ఉన్న ఖాళీలను నింపాలని కోరారు. అతి త్వరలో సింగరేణి ఏరియాలో ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సందర్శించడం జరుతుందని తెలిపారు. ఈ రోజు ఉదయం కమిటీ తొలి సమావేశానికి ముందు ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ అయిన వీర్లపల్లి శంకర్ అసెంబ్లీ లో తమ కార్యాలయం ను ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎనర్జీ ప్రిన్సిపుల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ యన్.బలరామ్ , తెలంగాణ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్), మాధవి,అసెంబ్లీ సెక్రటరీ నరసింహ చార్యులు ,అసెంబ్లీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.