
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే రైతు మహా ధర్నాకి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తో కలిసి బయలుదేరిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు రంగారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో జరిగిన రైతు మహాధర్నాలో రైతులను చూస్తుంటే కొడంగల్ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కి మరి ఈరోజు తన నియోజకవర్గం ప్రజలకే ఇచ్చిన వాగ్దానాలు రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇలాంటి పథకాలు ఏమి ఇవ్వలేదని రాష్ట్ర ప్రజలకు ఇంకా ఏమిస్తాడని అన్నారు. ఇకనైనా కక్షపూరిత రాజకీయాలను వదిలిపెట్టి ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశారు అవి నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి సతీష్ రావు, వెముల ఆంజనేయులు, పర్వత సతీష్ కుమార్, పల్లపు బాబు, గౌని శ్రీనివాస్ సాగర్, సిల్వర్ మనీష్, జగదీష్, రాము, భాస్కర్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.