
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్)ఫరూక్నగర్ మండలం వెలిజర్ల గ్రామపంచాయతీలో గత 15 సంవత్సరాల గ్రామపంచాయతీ కార్మికుడిగా వాటర్ మెన్ గా సేవలందించి ఈ మధ్యకాలంలో . గ్రామంలో మంచినీటి వాల్ తిప్పుతుండగా కాలు పైన పడి ప్రమాదానికి గురికాగా. ఈరోజు రాత్రి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో మృతి చెందాడు కాబట్టి పంచాయతీరాజ్ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీ కార్మికుడు యాదయ్య కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కార్మిక సంఘ నాయకులు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్ రాజు వ్యవసాయ కార్మిక సంఘం సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు