
పయనించే సూర్యుడు: ఫిబ్రవరి 15: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ. వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోగల పేరూరు ఆశ్రమ ఉన్నత పాఠశాల లో హెడ్ కుక్ గా విధులు నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన దుబ్బ కృష్ణవేణి, ఫిబ్రవరి 14 శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మరణించడం జరిగింది. శనివారంరోజు దహన సంస్కారనం అంతిమ యాత్ర ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం తరుపున వచ్చే 30,000/- రూపాయలు పాఠశాల ఇంచార్జి, ప్రధానోపాధ్యాయులు బద్రి,చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈయొక్క కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింగరావు, బాలాజీ, గ్రామపెద్దలు ఎట్టి. సుదర్శన్, టింగ బుచ్చయ్య మరియు కృష్ణవేణి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.