
డాక్టర్ భార్గవి గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలత జనరల్ ఫిజిషన్
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 17: షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ రంగా రెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం పరిధిలో బూర్గుల గ్రామం లో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో డాక్టర్ భార్గవి గైనకాలజిస్ట్ మహిళలకు రక్త మూత్ర పరీక్షలు ఇందులో భాగంగా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు గ్రామస్థులకు ఉచితంగా అందజేశారు. అదేవిధంగా రోగులకు సలహాలు, సూచనలు అందజేశారు. గ్రామంలో 50 శాతం మంది ఈ క్యాంపులో పాల్గొని ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకునన్నారు.ఈ కార్యక్రమంలో శంకర్ యాదవ్, మురళి కృష్ణ, తులసి, లావణ్య ప్రగతి, శ్వేత శృతి, జగదీష్, కార్తీక్,తదితరులు పాల్గొన్నారు..