
తెలంగాణా దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి (పోనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి తెలంగాణా దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి బాణోత్ లక్ష్మ అధ్యక్షతన శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్ర పటానికి పూల మాలతో హారతి ఇచ్చి కొబ్బరి కాయలు కొట్టారు అనంతరం సద్భావన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంఘం జిల్లా అధ్యక్షులు మాలోత్ జగ్గుద్దష్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను కొనసాగించాలని అన్నారు బంజరుల ఆరాధ్య దైవం అతను అహింస, ధర్మం గొప్పతనాన్ని బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా భావిస్తారని, మానవాళికి సన్మార్గాన్ని నేర్పిన మహానీయుడు శ్రీ సంత్ సేవాలాల్ ఆయన మార్గం ఆచరణీయం అహింస మార్గాన్ని బోధించి బ్రిటిష్ వాళ్లపై తిరుగుబావుట ఎగరవేసిన వారు. జాతి ప్రయోజనాల కోసం అహర్నిశలు పనిచేసిన సేవాలాల్ అందరికీ ఆదర్శం అని అన్నారు. ఈ కార్య క్రమంలో కాటి నాగేశ్వరావు, సువన్, మంగీలాల్ , కిషన్ తదితరులు పాల్గొన్నారు