
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 19. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు : విజయ విఘ్నేశ్వర దేవాలయం కమిటీ సభ్యులు ప్రతి బుదవారం చేస్తున్న అన్నదానం కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మానవ జన్మ మహా గొప్పదని, అందులో భక్తి మార్గం చాలా గొప్పది ,మన సంపాదనలో కొంతైనా భక్తి మార్గం అన్న ప్రసాదం లాంటి కార్యక్రమాలు చేయాలన్నారు. భగవంతుడికి నచ్చేది ఒకటేనని భక్తులకు అన్న ప్రసాదం, పేదలకు అన్నదానం వస్త్ర దానం ఎంతో అవసరం మనకు తోచిన విధంగా చేయాలని అన్నారు. దీని ద్వారా మన కుటుంబాన్ని మన రక్తసంబంధీకులను స్నేహితులను శ్రేయోభిలాషులను దేవుడు దీవెన ఆశీర్వాదం పొందుతామని అన్నారు. కమిటీ సభ్యులు అయిత ప్రకాష్ విజయలక్ష్మి దంపతుల 41 వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకోని వారిని సన్మానించి సత్కరించారు.ఈ కార్యక్రమంలో పల్లపోతు వాసు, అనూప్ ఖండేల్ వాల్, కా.శ్రీనివాసరావు, రాము, జీవీ, బోగా.నారాయణ, శ్రీనివాసరావు, బొడ్ల.మహేష్, నగేష్, బిక్షం, బొబ్బాల.వెంకట్ యాదవ్, వీరబాబు, గణేష్, మరియు విజయ విగ్నేశ్వర దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.