
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 25 : పొనకంటి ఉపేందర్ రావు న్యూస్, ఫిబ్రవరి 25 సోమవారం టేకులపల్లి మండలం సులానగర్ గ్రామంలో అద్భుతాల మేరీ మాత మందిర 3వ వార్షికోత్సవం సులానగర్ ఆర్.సి.యం చర్చ్ ఫాదర్ మార్నేని అర్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం పీఠాధిపతులు బిషప్ శ్రీశ్రీశ్రీ సాగిలి ప్రకాష్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయనకు కోలాట నృత్యం తో చిన్నారుల డ్యాన్స్ తో ఆర్.సి.యం చర్చ్ సభ్యులు బిషప్ కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్.సి.యం సంఘ సభ్యులు బిషప్ ని శాలువలతో ఘనంగా సత్కరించారు.ఈ వేడుకల్లో ఉమ్మడి జిల్లా ఫాదర్లు తుంపాటి ఆగస్టీన్, జయరాజు, జయ నందు, అమృత్, తుడుం యాకోబు, విజయ్ , మరియు కన్య స్త్రీలు, సంఘ పెద్దలు, ఉపదేశులు, యువత, కోయగూడెం, మాలపల్లి, సులానగర్, గ్రామాల నుంచి అధిక సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.