
పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 15 నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
కమ్మ ర్ పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింకట రవి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెం నరసయ్య నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండల కేంద్రంలో గత గురువారం జరిగిన అసెంబ్లీ సమావేసంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ని ఏకవచనంతో సభ నీ సొంతం కాదు అంటూ మాట్లాడి గౌరవ స్పీకర్ స్థానాన్ని ఆగౌరపరిచిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి శాసన సభ సభ్యత్వాన్ని రద్దుచేయాలని పీసీసీ అధికార అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమండ్ చేశారు జగదీష్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీలో ఉంది కాబట్టి తక్షణమే శాసనస సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు ఈరోజు
కమ్మరిపేల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బహుజనుడు స్పీకర్ స్థానంలో ఉండడాన్ని బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని మొదటి నుంచి బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకులు కేసీఆర్ కేటీఆర్ లేనని బహుజనులంటే అంటే ఇంత అసహనమా ఎందుకింత అహంకారం
బడుగు బలహీన వర్గాలు లేకుండానే మీరు ఎమ్మెల్యే గెలిచారా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీశ్ రెడ్డికి శాసన సభను స్పీకర్ స్థానానికి గౌరవించాలని తెలియదా ఒక దళితుడు స్పీకర్ స్థానాల్లో కూర్చోవడం టిఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదని అన్నారు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నాయకుడిగా ఉన్న దళితుడైన బట్టి విక్రమార్కుని కూడా ఇలానే అవమానపరిచారు ప్రతిపక్ష పాత్ర లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో కలుపుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చేసిన గనుడు కేసీఆర్ కాదా అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి కులగనమ చేపెడితే కనీసం సర్వేలో కూడా కేసీఆర్ కుటుంబం పాల్గొనలేని వీళ్ళు. దళిత బహుజన వ్యతిరేకులని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుంటే దాన్ని కూడా హేళన చేసే విధంగా మాట్లాడారని ఆయన ఆరోపించారు దీనిని బట్టి చూస్తే దొరల పార్టీ బహుజనుల పట్ల దళితుల పట్ల వారి వైఖరి వారి ఆలోచన ఏవిధంగా ఉందో తెలిసిపోయింది అన్నారు దళితులను బడుగు బలహీనర్గాలను పట్ల మీ వైకిరిని మార్చుకోక పోతే కెసిఆర్ ను తెలంగాణ సమాజం క్షమించదని అన్నారు ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు సుంకేట రవి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య . నిమ్మ రాజేంద్రప్రసాద్ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగల ప్రవీణ్. రేవతి గంగాధర్ సుంకేట శ్రీను యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెడ్డబోయిన నరేంద్ర ముదిరాజ్ గణేష్ గౌడ్, అజారుద్దీన్
సాక్కరం నర్సయ్య. కుందేటి శ్రీను నాగరాజ్, రంజిత్. ఉబేదుళ్ళ లు పాల్గొన్నారు
