
ఫోటో: సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం..
రుద్రూర్, మార్చ్ 28 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 90వ మహాజనసభ ను శుక్రవారం విండో అధ్యక్షుడు బి. సంజీవరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాటా త్వరగా ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. కోత కోసి వడ్లు ఎండ బెట్టుకొనుట స్థలం కూడా లేదని వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ తొంట శంకర్, డైరెక్టర్ కర్క అశోక్, ఏముల గజెందర్, సుబాని, సొసైటీ సెక్రటరీ లక్ష్మణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.