వచ్ఛే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు

June 19, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు19.06.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టికే గంగాధర్ : జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి
ఈరోజు శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ 56వ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, డిసిసి కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ 2004లో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా రాహుల్ గాంధీ ని క్యాబినెట్లోకి తీసుకుంటామని అడిగినప్పుడు రాహుల్ గాంధీ పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారని వారికి అవకాశం ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా 2009లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచినప్పుడు మన్మోహన్ సింగ్ రాహుల్ గాంధీ ని ప్రధాని చేయాలి అనుకుంటే మీ పాలన బాగుంది మీరే ప్రధానీగా కొనసాగాలి అని మన్మోహన్ సింగ్ ని ప్రధానిని చేసి ఎలాంటి పదవులు కూడా ఆశించకుండా సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం పని చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ . 2014 తర్వాత దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మత విద్వేషాలకు వ్యతిరేకంగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్లు భారత్ జోడోయాత్రను వానకు ఎండకు భయపడకుండా పూర్తి చేశరని భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలవడం జరిగిందని ఆయన అన్నారు. ఇటీవల తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల డిసిసి అధ్యక్షులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో రాహుల్ గాంధీ 4:30 గంటలకు సమయం ఇచ్చి మాతో సామాన్య కార్యకర్తగా కలిసి ప్రతి పనిని చేశారని, ఆ శిక్షణ కార్యక్రమంలో మాకు దిశా నిర్దేశం చేశారాణి,మీనాక్షి నటరాజన్ మా అందరికీ ఫ్లోర్ తుడిచే కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమంలో కూడా వారు పాల్గొన్నారు అని,ప్రధాని కాబోయే వ్యక్తి చాలా సింపుల్సిటీగా ఉంటున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ని మీరు ప్రధాని కావాలని ఒప్పుకోవాలని మీరు ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఒప్పించడంతో రాహుల్ గాంధీ ఆ మీటింగ్లో ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ ని ప్రధాని మంత్రిగా చేసే విధంగా కంకణబద్ధులై పని చేయాలని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కి 56వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నగేష్ రెడ్డి అన్నారు
ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ ద్వేషపు మార్కెట్‌లో ప్రేమాస్పద దుకాణం (మొహబ్బత్ కీ దుకాణ్)
రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో తరచూ వాడే అత్యంత ప్రజాదరణ పొందిన మాట అని అన్నారు.”నఫ్రత్ కే బజార్ మే, మొహబ్బత్ కీ దుకాణ్ ఖోల్ (ద్వేషంతో నిండిన ఈ సమాజంలో, నేను ప్రేమను పంచే దుకాణాన్ని తెరుస్తున్నాను) అని రాహుల్ గాంధీ నినదించారు.దేశంలో అందరూ కలిసికట్టుగా, శాంతియుతంగా ఉండాలనేదే నా ఆకాంక్ష.యువత మరియు విద్యార్థుల భవిష్యత్తు అని ఇటీవల విద్యార్థుల పరీక్షల లీకేజీలు (ఉదాహరణకు NEET వివాదాలు), టెలిగ్రామ్ వంటి యాప్‌లపై నిషేధాల గురించి స్పందిస్తూ యువత పక్షాన నిలిచారు అన్నారు.”దేశంలో విద్యావ్యవస్థ విద్యార్థులను వేధించే సాధనంగా మారకూడదు. తప్పు చేసిన మాఫియాపై చర్యలు తీసుకోవాలి కానీ, రాత్రింబగళ్లు కష్టపడే విద్యార్థులపై కాదు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది అన్నారు. భయం లేని సమాజం (డరో మత్)తనను విమర్శించే వారికి, దేశ ప్రజలకు ఆయన ఇచ్చే ముఖ్యమైన సందేశం:”సత్యం కోసం పోరాడేటప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ‘డరో మత్’ (భయపడకండి).ప్రజల గొంతుకను వినిపించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అని రాహుల్ గాంధీ అన్నారు.
బలహీన వర్గాల కోసం పోరాటంరాహుల్ గాంధీ తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ పేదలు, రైతులు, మరియు వెనుకబడిన వర్గాల (OBC, SC, ST) హక్కుల గురించి గళమెత్తుతుంటారు.ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి రమేష్, నూడా చైర్మన్ కేశ వెను, రాష్ట్ర సంక్షేమ చైర్మన్ కవిత రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రత్నాకర్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్ , జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా st సెల్ అధ్యక్షుడు యాదగిరి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, ఏఐసీసీ కో ఆర్డినేటర్ గనరాజ్, నగర కోశాధికారి శివ, నగర ఉపాధ్యక్షులు విజపాల్ రెడ్డి,కో ఆప్షన్ మంబర్ నరంద్ర సింగ్, మాజీ sc సెల్ అధ్యక్షులు లింగం, రాజేందర్, రఘు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గణేష్,పంచారెడ్డి చరణ్, సుమన్, కిష్టాగౌడ్, నర్సింగ్, అవీన్, మీనా శర్మ, మరియు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper