
పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 20:-రిపోర్టర్ (కే శివకృష్ణ )
కర్లపాలెంలో జాతీయ రహదారి పక్కన ఇటీవల నూతనంగా ప్రారంభించిన శ్రీ షణ్ముఖ ఫ్యూయల్ స్టేషన్ ( పెట్రోల్ బంక్ ) లో వేసవికాలం కావడంతో కస్టమర్ల కోసం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రమును వైయస్సార్ సిపి బాపట్ల నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి గారు ప్రారంభించారు. కస్టమర్లకు, నాయకులకు కోన మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ మేనేజింగ్ డైరెక్టర్ పేరాల వెంకట సురేష్, వైయస్సార్ సిపి కర్లపాలెం మండల అధ్యక్షుడు ఎల్లావుల ఏడుకొండలు, వైస్ ఎంపీపీ పందరబోయిన సుబ్బారావు, వైయస్సార్ సిపి జిల్లా కార్యదర్శి మందపాటి పరమానంద కుమార్, వైఎస్ఆర్ సీపీ బాపట్ల నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు ఆట్ల నాగేశ్వర్ రెడ్డి, బాపట్ల నియోజకవర్గం ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు మరియూ పెదపులుగు వారి పాలెం సర్పంచ్ అక్కల శ్రీనివాసరెడ్డి, బాపట్ల నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జాకీర్ హుస్సేన్, గణపవరం సర్పంచ్ దేవరకొండ అంకమ్మ, ఎంపీటీసీ ఎస్.కె ఆసిఫ్, కో ఆప్షన్ సభ్యుడు ఎండి అమీర్ బేగ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.