బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్రామారావ్ &కెటిఆర్‌పై గద్వాల్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లి వైస్ ప్రెసిడెంట్ మాచర్ల లక్ష్మణ్ ఫైర్
పయనించే సూర్యుడు న్యూస్ 22గద్వాల: నియోజకవర్గం.డ్రామారావ్ &కెటిఆర్‌కు అధికారం పోయాక పిచ్చి పట్టుకుందని, నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని డ్రామా రావ్& కేటీఆర్ పై మాచర్ల లక్ష్మణ్ మండిపడ్డారు.BRS బలిసిన రాబందుల సమితి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దళితుల భూములు, అసైన్డ్ భూములు, కోర్టు ఆఫ్ వార్డ్స్ భూములు, భూదాన్ భూములు మరియు ప్రభుత్వ భూములను గతంలో మీ ప్రభుత్వం దౌర్జన్యంగా దోచుకుందని మాచర్ల లక్ష్మణ్ గారు ఆరోపించారు.కేటీఆర్ మీ అయ్య తాగుబోతు కెసిఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం చేసిన అకృత్యాలు ఎస్బిఐ అధికారుల వరకు చేరాయని, వారు ఫోన్ ట్యాపింగ్ లేదా ఇతర కారణాలతో వారిని లొంగదీసుకున్నారని మాచర్ల లక్ష్మణ్ అన్నారు.2011లో ఎస్బిఐ కేటాయించిన భూమిని కూడా గత ప్రభుత్వమే రద్దు చేసిందని పేర్కొన్నారు.అంతేకాకుండా, ఈ భూములలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా నిలిపివేసి, చివరికి ఆ భూములను వేలం వేయకుండా, ఆ వేలాన్ని అడ్డుకోవాలని కుట్రలు చేశారని మాచర్ల లక్ష్మణ్ విమర్శించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్బిఐకి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు.ప్రభుత్వ భూమిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రకృతి విధ్వంసం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. మీ రాజకీయం ఇంత నీచానికి ఎందుకు దిగజారిందని మాచర్ల లక్ష్మణ్ కెటిఆర్‌ను ప్రశ్నించారు.డ్రామారావ్&కేటీఆర్ కేవలం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి, రోజుకో మీటింగ్ పెడుతున్నారని మాచర్ల లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై నిరంతరం విషం చిమ్మడమే డ్రామారావ్&కేటీఆర్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను మరియు వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు నమ్మరు నమ్మబోరు మాచర్ల లక్ష్మణ్ గుర్తు చేశారు.రాష్ట్ర అభివృద్ధికి నిధులు రాకుండా అడ్డుకోవడమే కాకుండా, ఎస్బీఐ (SBI) వంటి ఆర్థిక సంస్థల అధికారులను కూడా కేటీఆర్ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారని మాచర్ల లక్ష్మణ్ ఆరోపించారు.బ్యాంకింగ్ అధికారులను రాజకీయాల్లోకి లాగడం అత్యంత నీచమైన చర్య అని ఆయన తీవ్రంగా విమర్శించారు.గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారని మాచర్ల లక్ష్మణ్ ఆరోపించారు. ఇలాంటి రాబందుల మాటలను తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరని ఆయన స్పష్టం చేశారు.గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కాపాడిన నాయకులే ఇప్పుడు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తున్న డ్రామాలను ఎండగడుతూ, ప్రజలు దీన్ని గమనిస్తున్నారని మాచర్ల లక్ష్మణ్ పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చేస్తున్న పాలనను పనులు ప్రజలు చూస్తున్నారని, ఇకనైనా కేటీఆర్ ఇటువంటి అబద్ధాల రాజకీయం మానుకోవాలని లేని యెడల తెలంగాణ ప్రజలు ఈసారి మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా మిమల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయని మాచర్ల లక్ష్మణ్ హెచ్చరించారు.