ప్లాస్టిక్ రహిత పట్టణంగా సూళ్లూరుపేటను చూడగలమా?

May 12, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు మే12 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరు పేట నియోజకవర్గ0 పరిధిలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మహమ్మారి తాండవం ఆడుతున్నది చాప కింద నీరులా క్యాన్సర్ రోగాలు పుట్టుకొస్తున్న స్పందించని అధికారులు ప్రభుత్వం మాత్రం ప్లాస్టిక్ రహిత రాష్ట్రం గా తీర్చి దిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం తమిళనాడు సరిహద్దులోని రాకెట్ టౌన్గా పిలవబడే సూళ్లూరుపేట పట్టణంలో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి అధికారులు పూనుకున్నట్లుగా కనబడటం లేదు అని పట్టణంలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు కేవలం తూతూ మంత్రంగా దుకాణాల మీద దాడి చేసి కొన్ని కవర్లను పట్టుకొని వారికి ఫైన్లు వేసినంతమాత్రాన వీటిని అడ్డుకుంటున్నామని చెప్పడం నమ్మశక్యం కానిది నిజంగానే వీటిని అడ్డుకోవాలంటే అవి తయారయ్యే కంపెనీ నుంచి వ్యాపార నిమిత్తం మార్కెట్లోకి రాకుండా ఆపగలిగినప్పుడే అన్న విషయం అధికారులకు తెలిసిన వాటిపై ఎటువంటి చర్యలు ఇంత వరకూ తీసుకున్నట్లుగా కనబడుటలేదు అనే పట్టణ ప్రజలు చెబుతున్నారు.. ప్లాస్టిక్ పేపర్ కవర్ల కు ప్రత్యామ్యంగా ఏం వాడాలన్న విషయాన్ని కూడా ప్రజలలో అవగాహన కల్పించలేక పోతున్న అధికారులు ఇకనైనా చర్య తీసుకుం టారా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు కేవలం ప్రచార నిమిత్తం ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చి దిద్దాలని చెప్పుకుం టు న్నట్లుగానే కనబడు తున్నది. ఇకనైనా అధికారులు మేల్కొని తీవ్రమైన చర్యలు తీసుకుంటారా లేక క్యాన్సర్ వ్యాధికి ప్రజలను బలి ఇస్తారా ప్రకృతి పరంగా లభించే మందారాకు,అరటి ఆకులను పట్టణంలోని ప్రజలు వ్యాపారస్తులు ఉపయోగించాలని అవేర్నెస్ కార్యక్రమాన్ని ఒకటి బలంగా ప్రజలలో తీసుకు వెళ్ళగలిగితే 70% మార్పును చూడగలము అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు దుకాణం లో అవి దొరకని పక్షాన ప్రజలు కచ్చితంగా ప్రకృతి పరంగా లభించే ఆరోగ్యపరమైన విషయాల వైపే మొగ్గు చూపుతారు అన్నది నిజమే కదా అని పట్టణ ప్రజలు అనుకుంటున్నారు

📰 ePaper