
పయనించే సూర్యుడు// న్యూస్ మే 16//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంపై మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ డిపిఓ రిపోర్టు, ఫారెస్ట్ క్లియరెన్స్, ల్యాండ్ అక్విషన్, కృష్ణ బోర్డు నుండి కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు బూత్పూర్ జలాశయం నుంచి కొడంగల్ కు నియోజకవర్గం నీళ్లు తీసుకుపోవడం, ఎలాంటి అనుమతులు లేకుండా ముందుగానే కాంట్రాక్టర్ 100 కోట్ల బిల్లులకు పెట్టడానికి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంతో ఈ జిల్లా ప్రజలకు తెలుసని ఇప్పటికే భూత్పూర్ జలాశయం నుండి నీళ్లు తీసుకుపోవడం వల్ల నర్వ అమరచింత ఆత్మకూరు మండలాలు పొలాలు ఎడారిగా మారే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నరసింహ గౌడ్, చిన్న హనుమంతు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
