
- డాక్టర్ కందుల దినేష్ పయనించే సూర్యుడు మే 16 టేకులపల్లి
- ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
- టేకులపల్లి జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా స్థానిక వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ గారి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఈరోజు ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులో డెంగ్యూ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ నిల్వ ఉన్న మంచినీటిలో వృద్ధిచెంది పెరిగే ఈ ఏడిస్ దోమ డెంగ్యూ వైరస్ ఉన్న వ్యక్తులను కుట్టి ఆరోగ్యవంతులను కుట్టడం ద్వారా ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని ఈ వ్యాధి లక్షణాలు అయిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, కండరాలు కీళ్ల నొప్పులు, కంటి వెనకాల నొప్పి, వాంతులు వికారం, నీరసం చర్మంపై దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తాయని పై లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ నిర్ధారణ కొరకు చేసే ఎలిసా పరీక్ష చేయించుకోవాలని వ్యాధి నిర్ధారణ జరిగితే వెంటనే ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలని వ్యాధి తీవ్రత అధికం అయితే శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్య పడిపోయి అంతర్గత రక్తస్రావం జరిగి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడవచ్చు అని తెలిపారు అన్నిటికంటే ముఖ్యంగా వ్యాధి వచ్చిన తర్వాత బాధపడే కంటే వ్యాధి రాకుండా ఉండడానికి అన్ని రకాల నివారణ చర్యలు ప్రజలు స్వచ్ఛందంగా తీసుకోవాలని కోరారు దోమ పెరగడానికి అవకాశం ఉన్న ఇంటి లోపల మరియు ఇంటి చుట్టూ ఉన్న నీటి నిల్వలు నిరంతరం తొలగించాలని ప్రతి శుక్రవారం మరియు మంగళవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని గ్రామాలలో ఉన్న మురికి కాల్వల్లో చెత్తాచెదారం వేయడం ద్వారా నీటి నిల్వలు పెరిగి వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటుందని పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ వ్యాధిపై ఇంటిలో ప్రతీ ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని పెరిగిన దోమలు కుట్టకుండా ఉండడానికి దోమ తెరలు వాడడం దోమ రసాయనాలను వాడడం కిటికీలకు తలుపులకు దోమ జాలీలను అమర్చుకోవడం నిండుగా బట్టలు ధరించడం చేయాలని అలాగే వైద్య సిబ్బందికి సహకరించి వారుఇచ్చే సూచనలు సలహాలు పాటించి వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కంచర్ల వెంకటేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి ఇల్లందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్ నాగు బండి వెంకటేశ్వర్లు కౌసల్య సింగ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ధరణి అమూల్య హారిక ఇంద్రజ నాగలక్ష్మి ఫార్మసీ ఆఫీసర్ శశికళ కిరణ్ కుమారి ల్యాబ్ టెక్నీషియన్ రాజు, గంటా శ్రీనివాస్ అరుణకుమారి ధనసరి రాంబాబు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు