మాగనూరు మండల 108అంబులెన్స్‌ ఆకస్మిక తనిఖీ

June 26, 2026 | తెలంగాణ

గోల్డెన్ అవర్ లోపు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రులకు చేర్చాలి – DH&HO డాక్టర్ జయ చంద్రమోహన్

108 ఉచిత అంబులెన్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి- రవికుమార్ ( ప్రోగ్రాం మేనేజర్ )

:పయనించే సూర్యుడు జూన్27 : నారాయణపేట జిల్లా: ( మాగనూరు మండలం): మాగనూరు 108అంబులెన్స్ సేవలను ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ రవికుమార్.మరియు నారాయణపేట జిల్లా 108 మేనేజర్ సునీల్ కుమార్ తో కలిసి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాగనూరు 108 అంబులెన్స్‌లోని సౌకర్యాలు, అత్యవసర వైద్య పరికరాల పనితీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుత రోడ్డు ప్రమాదాలు, పాము కాటు బాధితులు, పాయిజన్ కేసులు మరియు ఏ ఇతర వైద్య సేవలపై బాధితులకు అందించాల్సిన అత్యవసర ప్రథమ చికిత్సపై 108 అంబులెన్స్ సిబ్బందికి ఆయన కీలక సూచనలు చేశారు. బాధితులను ఆసుపత్రికి తరలించే లోపే వారి ప్రాణాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స కు సంబంధించిన పలు జాగ్రత్తలను వివరించారు. అంబులెన్స్‌లో మెడికల్ కిట్లు, పరికరాలుఅవసరమైన మందుల నిల్వలను తనిఖీ చేసి, గడువు ముగిసిన మందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. వైద్య పరికరాలతో పాటు అంబులెన్స్ వాహన పరిస్థితిపై కూడా ఆయన సమీక్షించారు. అత్యవసర సమయాల్లో వాహనం మొరాయించకుండా ఎప్పటికప్పుడు మెకానికల్ చెకప్ చేయించుకోవాలని పైలట్లకు సూచించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణదాతలుగా నిలవాలని సిబ్బందిని కోరారు. ఈ తనిఖీలో 108అంబులెన్స్ సిబ్బంది, టెక్నీషియన్ రాకేష్, పైలెట్ అనిల్, పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper