ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఒకే ఒక నాయకుడు సుమంత్ రెడ్డి

పయనించే సూర్యుడు జూన్ 26 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట
నియోజక వర్గ పరిధిలో దొరవారిసత్రం మండలం మోదుగుల పాలెం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రతరం రూపం దాల్చింది అయినా కూడా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పులేదు? మోదుగులపాలెం గ్రామస్తులకు మాకు త్రాగునీరు ఎవరు కల్పిస్తారు దేవుడా అని ఎదురుచూస్తుండగా కొందరు గ్రామ పెద్దలు ఈ తాగునీటి సమస్యని గురించి YSRCP రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి వేనాటి సుమంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆ సమస్యను ఆయన గ్రహించి వెంటనే దయ హృదయంతో స్పందించి రాజకీయాలకు అతీతంగా ఒక ఆత్మీయుడుగా ఆ గ్రామస్తులకు తాగునీటి సౌకర్యం కొరకు ఒక లక్ష రూపాయల తో ఆయన బోర్ వేయించి గ్రామస్తులకు తాగినీటి సమస్య తీర్చినందువలన వేనాటి సుమంత్ రెడ్డి మొదరుపాలెం గ్రామస్తుల ఆప్తుడుగా వాళ్ళ మనసును గెలిచిన వ్యక్తిగా స్థిర స్థాయిగా నిలిచిపోతారని ఆ గ్రామస్తులు అందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.