ఏ మట్టి అయినా బంగారమే తవ్వే దోచేయ్ ఇది మన సామ్రాజ్యం

May 14, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు మే 14 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లాసూళ్లూరుపేట మండలంలో ఏ మట్టి అయినా బంగారమే తొవ్వేయవచ్చు దోచేయవచ్చు మనం లేవురా ఆపేది అనే నినాదంతో సూళ్లూరుపేట మండలంలో పేరు ప్రఖ్యాతలు దాల్చిన ప్రాంతం ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడో దేశ విదేశాల పక్షులకు ఆహార ప్రాంతంగా పిలవబడుతుంది.అటు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అతి సమీపంలో ఉంది,మరోవైపు చెరువులను తోడేస్తున్నారు అక్రమ మట్టి మాఫియా తప్పుడు అనుమతి పత్రాలతో ప్రభుత్వ ఆదాయ ఖజానాకు గండి కొడుతున్న పలుమార్లు రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదులు అందిన నామమాత్రపుగా అలా పర్యటనకు వెళ్లినట్టు వెళ్లి ఇలా తిరిగి వచ్చేస్తారు.రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారుల వ్యవహార శైలు.ఇదంతా చూస్తుంటే వింటుంటే ఖచ్చితముగా ప్రభుత్వం ఉద్యోగులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారనే ఆరోపణలతో సహా రాజకీయ నాయకుల కనుసందానాల్లో మరియు అక్రమ మట్టి మాఫియా ప్రలోభాలకు గురయ్యారని అనేక అనుమానాలు బలపడుతున్నాయి.పలుమార్లు గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు.నిత్యం రేయి పగలు తేడా లేకుండా సామాన్య ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ అక్రమ మట్టి మాఫియా భారీ యంత్రాల శబ్దాలు,మితిమీరిన వేగముతో మద్యం మత్తులో ట్రాక్టర్ల నడుపుతు శబ్ద కాలుష్యంతో తమ గృహాలను విడిచి వెళ్లిపోయే దుస్థితి ఏర్పడిందని ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామస్తులు.అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదంటూ అధికార యంత్రాంగం పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్న దున్నపోతుపై వర్షం కురిసినట్టు అధికారుల వ్యవహారి తీరు ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.అక్రమార్కుల అక్రమ మట్టి మాఫియా వేధింపుల నుంచి మమ్మల్ని కాపాడాలి కూటమి ప్రభుత్వం.అక్రమార్కులపై కొరడా జులిపించాలని సాక్షాత్తు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించినప్పటికీ సూళ్లూరుపేట అధికారుల తీరు మాత్రం ముడుపుల మూట మాకు ముట్టడం ముఖ్యమని ఆస్తులను కూడబెట్టుకునే పనిలో పడ్డారు అధికార యంత్రాంగం.మాకు ముడుపులు ముఖ్యమని ప్రభుత్వ అధికారులు తమ ధ్యేయంగా భావిస్తున్నారని అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.పూర్తి వివరాల్లోకి వెళితే ఎక్కడ కాళీ చెరువు కనిపిస్తుందా అని రాబందువుల్లా భూగర్భ జలాల భూములను మింగేసేందుకు నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా అల్లరి మూకలను వెంటబెట్టుకుని అక్రమ మట్టి త్రవ్వకాలను అడ్డుకునేందుకు వచ్చిన వారిపై దాడులకు తెగబడేందుకు సిద్ధం చేసి ఉంచుతారు ఈ అక్రమ మట్టి మాఫియా.ఈ అక్రమ మట్టి మాఫియా కు తోడ్పాటును అందించేది ఎవరో కాదండోయ్ స్వయానా అనునిత్యం పేద ప్రజల సమస్యలపై పోరాడే ఎర్రజెండా కార్యకర్త,మరొక రు కూటమిపాలకుల ముఖ్య సీనియర్ నేత అయిన కుమారుడు,మరో పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు అనుచరుడు.ఇలాంటి అక్రమార్కులకు నిరంతరం అండ దండాలతో భరోసాను కనిపిస్తున్నది ఎవరు? ముడుపుల ముసుగులో రెవెన్యూ శాఖ అధికారుల? పైన పటారం లోన లొటారం అని వ్యవహరించే నాయకుల ? మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వైపు కన్నెత్తి చూడరంటూ అక్రమ మట్టి మాఫియా చాలా రేగుతుంది? అంతేకాక స్థానిక పట్టణవాసులకు అర్ధరాత్రి వేళల్లో భారీ యంత్రాల సాయంతో భూగర్భ జలాలకు గండి కొడుతూ చెరువులను మింగేస్తూ తోడేస్తున్నారు యంత్రాల శబ్దాలతో పబ్లిక్ న్యూసెన్స్ వాతావరణాన్ని సృష్టిస్తు ఏ ఒక్క అధికారి ప్రజల భద్రత పై కాస్తంత కనికరం చూపెట్టకుండా గాలికి వదిలేసి అధికారులు మాత్రం ముడుపుల మతులో విలాసవంతలకు అలవాటు విడి సేద తీరుతు అందిన కాడికి దోచుకున్నామా దాచుకున్నామా అన్న చందంగా సూళ్లూరుపేట పట్టణ రెవెన్యూశాఖ,భూగర్భ జలాల శాఖ,మైనింగ్,శాఖల తీరు.

🌐 Select Language:
📰 ePaper