ఓటర్ గణన పత్రాలు సమర్పించిన బీజేపీ మండల అధ్యక్షుడు అరె రవీందర్ దంపతులు.

July 9, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు D.9.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల కేంద్రంలోఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా గురువారం భీంగల్ మండలం మెండోరా గ్రామంలో మాజీ ఎంపీటీసీ సభ్యురాలు అరె లావణ్య, బీజేపీ భీంగల్ మండల అధ్యక్షుడు అరె రవీందర్ దంపతులు తమ ఓటర్ గణన (Enumeration) పత్రాలను పూర్తిగా నింపి ఎన్నికల అధికారి (BLO) దీప్సన్‌కు అందజేశారు.ఈ సందర్భంగా అరె రవీందర్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సక్రమంగా రూపొందడం ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు ఎన్నికల సంఘం సూచించిన విధంగా గణన పత్రాలను పూర్తిగా నింపి, అవసర మైన పత్రాలతో పాటు BLOలకు అందజేయాలని కోరారు.ప్రజలు ఎలాంటి అపోహలు, అసత్య ప్రచారాలను నమ్మకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకొని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

🌐 Select Language:
📰 ePaper