భైంసా పట్టణంలోని గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మొక్కల నాటడం నిర్వహించారు.

July 15, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: భైంసా, జూలై 15: పర్యావరణ పరిరక్షణే భావితరాలకు గొప్ప కానుక అనే సందేశంతో భైంసాలోని గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బొటానికల్ గార్డెన్‌లో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో పూల మొక్కల నాటడం కార్యక్రమాన్ని నిర్వహించారు.కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రఘునాథ్ మొక్కలను నాటె కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని, నేడు నాటిన ఒక్కో మొక్క రేపటి సమాజానికి ప్రాణవాయువును అందించే జీవనాధారమని అన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. ఓం ప్రకాష్ , నహేదా తపస్సుo మాట్లాడుతూ, మొక్కలను నాటడం మాత్రమే కాకుండా వాటిని పరిరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ భీమారావు, డాక్టర్ యు. రవికుమార్, డాక్టర్ శంకర్, డాక్టర్ సంతోష్ కుమార్, ఆరె రాజు, కిషన్, సురేందర్, రామ్‌మోహన్, అబ్దుల్లా, మజర్‌, ఇర్ఫాన్, సాయినాథ్ పటేల్, శ్రీనివాస్, అక్తర్ రసూల్ తదితర అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.విద్యార్థులు ఉత్సాహంగా మొక్కలు నాటి, ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ఒక్కో విద్యార్థికి అప్పగించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు కళాశాల ప్రాంగణాన్ని మరింత పచ్చదనంతో తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper