“ప్రజాస్వామ్య బలోపేతానికి ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలి : రాయికల్ శ్రీనివాస్”

July 15, 2026 | తెలంగాణ

( పయనించే సూర్యుడు జూలై 16 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతంగా అమలు చేయాలని ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్ అన్నారు.ఫరూక్‌నగర్ మండలంలోని రాసుమల్లగూడెం గ్రామ సర్పంచ్ నత్తి శివరాములు ఆహ్వానం మేరకు గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఇంటింటికీ సాగుతున్న ఓటర్ల నమోదు, వివరాల సవరణ, అవసరమైన పత్రాల సేకరణ ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి కార్యక్రమం పురోగతిని తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రాయికల్ శ్రీనివాస్ మాట్లాడుతూ …ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచించారు.గ్రామ ప్రజలు కూడా తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించి, అవసరమైతే సవరణలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.SIR ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమిష్టిగా పనిచేస్తే ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ మహేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, చించోడ్ గ్రామ సర్పంచ్ ర్యాకల శ్రీనివాస్, దేవునిపల్లి సర్పంచ్ మల్లేష్, కంసాన్‌పల్లి మాజీ ఎంపీటీసీ తుపాకుల శేఖర్,చించోడు అనంతం,చించోడు రాజు,అప్పారెడ్డిగూడ డిప్యూటీ సర్పంచ్ సీతారాములు, గ్రామ అధ్యక్షుడు రాజేష్ రెడ్డి, వార్డ్ సభ్యుడు దంగుల నరేందర్, మెరుగు రవీందర్, తిరంగి నవీన్, నరసింహులు, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper