అమర రాజా బ్యాటరీ సెల్ తయారీ ప్లాంట్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

July 15, 2026 | తెలంగాణ

మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక అమర రాజా బ్యాటరీ సెల్ తయారీ ప్లాంట్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ శ్రీ వీర్లపల్లి శంకర్ గారు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ పెట్టుబడులతో నిర్మితమైన అమర రాజా గిగా కారిడార్ సెల్ తయారీ యూనిట్ ను ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బ్యాటరీ తయారీ రంగంలో చైనా గుత్తాధిపత్యానికి తెలంగాణ నుంచే గట్టి పోటీ ఇవ్వనున్నామని, భవిష్యత్ సాంకేతికతకు అవసరమైన ఎనర్జీ స్టోరేజ్ రంగంలో తెలంగాణ కీలక కేంద్రంగా ఎదుగుతుందని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ముఖ్యంగా పాలమూరు యువతకు వేలాది ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, శ్రీ వాకిటి శ్రీహరి గారు, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, అమర రాజా బ్యాటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గల్లా జయదేవ్ గారు,స్థానిక ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper