యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి జూనియర్ సివిల్ జడ్జి ఆర్.కె. వెంకటరమణ సుహాస్

July 24, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:భైంసా, జూలై 24: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని, విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్పడరాదని భైంసా జూనియర్ సివిల్ జడ్జి శ్రీ ఆర్.కె. వెంకటరమణ సుహాస్ అన్నారు.సా పట్టణంలోని గురుకుల ఒకేషనల్ కళాశాలలో “మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు యాంటీ ర్యాగింగ్” అంశంపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తి ఆరోగ్యం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ర్యాగింగ్ చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని పేర్కొన్నారు. విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.ఈ సందర్భంగా పాల్గొన్న భైంసా టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సాయికిరణ్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని అన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.కార్యక్రమంలో న్యాయవాదులు అంజద్ షేక్, దుసంవాద్ చిన్నన్న, కళాశాల చైర్మన్ రామకృష్ణ గౌడ్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో అతిథులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది.

🌐 Select Language:
📰 ePaper