భోగాపురం విమానాశ్రయ ప్రారంభ ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వ విప్

July 31, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు జూలై 31 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురం ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పరిశీలించారు.ఈ సందర్భంగా రాజాం శాసనసభ్యులు కొండ్రు మురళి మోహన్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశమై కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారురాజాం నియోజకవర్గం నుంచి సుమారు 10 వేల మంది కార్యకర్తలు, ప్రజలు ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. సభకు హాజరయ్యే వారికి రవాణా, భోజనం, తాగునీరు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనపై చర్చించి సంబంధిత బాధ్యులకు సూచనలు చేశారుకార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు సూచించారు.

🌐 Select Language:
📰 ePaper