దేగాం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి నివాసంలో ఘనంగా అన్నభావు సాఠే జయంతి వేడుకలు

August 1, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:భైంసా మండలంలోని దేగాం గ్రామంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి నివాసంలో ప్రముఖ సమాజ సంస్కర్త, రచయిత సాహిత్యరత్న డాక్టర్ అన్నభావు సాఠే గారి 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అన్నభావు సాఠే గారి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, శ్రామిక వర్గం అభ్యున్నతి కోసం అన్నభావు సాఠే చేసిన సేవలు అజరామరమని కొనియాడారు. ఆయన ఆలోచనలు, సాహిత్యం నేటి సమాజానికి, యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి తో పాటు భైంసా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిందే గజానన్ పాటిల్, తానూర్ మండల మాజీ జడ్పీటీసీ ఉత్తమ్ భలేరావు, లింగ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ గణేష్, ఎల్వత్ నాయకులు శంకర్ పాటిల్, రామారావు పటేల్, అలాగే సురేష్ జాదవ్ గైక్వాడ్, ఝరి నాయకుడు సాయినాథ్, చిలింకర్ లక్ష్మణ్, మిర్జాపూర్ నాయకుడు అనిల్, మిలింద్ గైక్వాడ్, చంద్రకాంత్ గైక్వాడ్, సంజీవ్ కమలాకర్, రాజు కమలాకర్, భజరంగ్ కమలాకర్, దత్త హరి మరావత్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper