శ్రీ సత్తెమ్మ తల్లికి సారె సమర్పణ
పయనించే సూర్యుడు ఆగస్టు 6 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)ఐ పోలవరం మండలం బాణాపురం గ్రామదేవత శ్రీ సత్తెమ్మ తల్లికి ఆషాఢం సారె ఘనంగా సమర్పించారు. గ్రామ ఆడపడుచులు మాతృ మూర్తులు అమ్మవారికి చీర రవిక చలిమిడి పానకము స్వీట్లు పళ్ళు తో పేరాబత్తుల రామకృష్ణారావు సారధ్యంలో అమ్మవారి నామ స్మరణతో ఊరేగింపు గా బయలుదేరి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ వికాస్ కోనసీమ జిల్లా కార్యకర్త బి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ గ్రామ దేవత ఆరాధన అనునిత్యం జరగాలని పండుగలుకే పరిమితం కాకూడదని ఇంటి ఆడపడుచుకు ఏవిధంగా సారెతో మర్యాద చేస్తామో అలాగే గ్రామ ఆడపడుచు గా గ్రామ దేవతకు సారె సమర్పణ చేయడంవలన గ్రామం సుభిక్షంగా ఉంటుందని పాడి పంటలు పుష్కలంగా ఉంటాయని తెలియజేసి ఆషాడం సారె విశిష్టత గురించి వివరించారు. అనంతరం భక్తులంతా అమ్మవారికి హారతులిచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ కుటుంబ ప్రబోధన్ ప్రముఖ్ పేరాబత్తుల రామకృష్ణారావు కొలికోటి కృష్ణమూర్తి తోట చిరంజీవి మార్కండేయ తోట కృష్ణ దేవు నాగబాబు తోట రామచంద్రరావు తోట వెంకటేశ్వర్రావు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు యూత్ సభ్యులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.