కాట్రేనికోన మండలం కందికుప్పలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుక*
పయనించే సూర్యుడు ఆగస్టు 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, ఆగస్టు 15: కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు నూకల మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నూకల మూర్తి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని, ప్రజలందరూ దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత తరం యువత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకొని దేశానికి తమ వంతు సేవలు అందించాలని సూచించారు. స్వాతంత్ర్య విలువలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని దేశభక్తితో ముందుకు సాగాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ రామచందర్రావు నూకల దుర్గబాబు, డైరెక్టర్లు బొంతు జయరత్నం, బొంతు శివకుమార్, గ్రామ పెద్దలు, సొసైటీ సిబ్బంది, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించి, విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.