నేటి యువత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి : తెల్ల హరికృష్ణ
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్ పల్లి లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా కూకట్ పల్లి గౌడ్ సంగం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వారి ఆహ్వానం మేరకు రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ధైర్యసాహసాలు, ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం సభ్యులు, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల రాజకీయ నాయకులు, అన్ని వర్గాల నాయకులు, గ్రామస్తులు పాల్గొని ఘన నివాళులర్పించారు.