బహుజన వీరుడు పాపన్న గౌడ్ జయంతి కామనగరువులో ఘనంగా వేడుకలు

August 18, 2026 | తెలంగాణ

పాపన్న గౌడ్ ఆశయాలు స్ఫూర్తి – ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నివాళులు

పయనించు సూర్యుడు ఆగస్టు 18 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)కామనగరువు: బహుజన వీరుడు, విప్లవ యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ భీమన్న ఆధ్వర్యంలో, రాష్ట్ర ఓబీసీ మోర్చా పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మిరావు నేతృత్వంలో బీజేపీ, ఓబీసీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప యోధుడు పాపన్న గౌడ్ అని, ఆయన ఆశయాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.అనంతరం మాజీ సర్పంచ్ భీమన్నను ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు దుశ్శాలువాతో, పూలదండలతో సత్కరించారు.పాల్గొన్నవారు: పసుపులేటి మహాలక్ష్మిరావు, గూడవల్లి రాంబాబు, శీలం నరసింహ శెట్టి, వీర్నాల రమణబాబు, సానబోయిన సత్యనారాయణ, సహారా బేగం, కొండేటి జయలక్ష్మి తదితరులు.

🌐 Select Language:
📰 ePaper