విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి కాంటాక్ట్ కార్మికులు బలి

September 17, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 17 (సూళ్లూరుపేట నియోజకవర్o రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరులో కాంట్రాక్ట్ కార్మికుడికి విద్యుత్ షాక్ సూళ్లూరుపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నుండి తిరుపతికి తరలింపు.
దొరవారి సత్రం మండలం లో జరిగిన విద్యుత్ ప్రమాదం మరువకముందే సూళ్లూరుపేట మండలం కోటపోలూరులో మరో తీవ్ర విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో విద్యుత్ శాఖ పనితీరుపై, కాంట్రాక్ట్ కార్మికుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యుత్ శాఖ అధికారి డిఈ దీనిపై ఎలాంటి స్పందన లేదు.కోటపోలూరులో విద్యుత్ శాఖ లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఓ కార్మికుడు అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన అనంతరం విద్యుత్ స్తంభంపై లైన్ మరమ్మతు పనులు చేస్తున్నట్లు సమాచారం.అయితే అనుకోకుండా అదే లైన్‌లో తిరిగి విద్యుత్ సరఫరా రావడంతో కార్మికుడు ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. కోటపోలూరు లైన్మాన్ ఏం చేస్తున్నట్టు ఆ సమయంలో ? క్షణాల్లో జరిగిన ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.వెంటనే అతడిని హుటాహుటిన సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఒక గంట పైగా అతనికి సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి వారు ట్రీట్మెంట్ చేయగా ఆ గంట వ్యవధిలో ఏ విద్యుత్ అధికారి గాని పోలీస్ డిపార్ట్మెంట్ వారు గానీ వచ్చి అతను పరిస్థితి అడిగి తెలుసుకున్నది లేదు ఇక చేసేది ఏమీ లేకుండా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించినట్లు సమాచారం. అసలు షట్‌డౌన్ ఇచ్చిన లైన్‌లోకి లైన్ మెన్ మరియు లైన్ ఇన్స్పెక్టర్ కి తెలియకుండా కరెంట్ ఎలా వచ్చింది?ఈ ఘటన ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. పని చేస్తున్న కార్మికుడి భద్రతకు బాధ్యత ఎవరిది?అధికారుల అనుమతి లేకుండానే స్తంభాలపై పనులు జరుగుతుంటే వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎవరిది? విద్యుత్ శాఖ అధికారి డిఈ లేదా మరి ఎవరిది?విద్యుత్ శాఖలో భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ లోపాలకు ఇది ఉదాహరణా?దొరవారి సత్రం ఘటన జరిగిన కొద్దిరోజులకే కోటపోలూరులో మరో ప్రమాదం చోటుచేసుకోవడం.. చాలా బాధాకరం సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉంటున్న విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఇలాంటి సంఘటనలే జరుగుతాయి ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను జిల్లా యంత్రాంగం ఏం చర్యలు తీసుకుంటారో ఇకనైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్ట్ కార్మికుల భద్రతపై సమగ్ర విచారణ చేపట్టాల్సిన ఉంది విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరపాలి.

🌐 Select Language:
📰 ePaper