ఆర్టీసీ బస్సుల కోసం డీఎంకు వినతి పత్రం

లింగారెడ్డిగూడెం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ ల వినతిపత్రం
లింగారెడ్డిగూడ గ్రామ ప్రజల రవాణా సమస్యపై ఆర్టీసీ డిపో మేనేజర్ కరుణశ్రీ కి వినతిపత్రం
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) లింగారెడ్డిగూడ గ్రామంలో పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సులు సక్రమంగా ఆగకపోవడం వల్ల ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో షాద్‌నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ కరుణ శ్రీని కలిసి వినతిపత్రం అందజేశారు. మా గ్రామంలో ఆర్డీవో కార్యాలయం, ఐటీఐ కార్యాలయం, సెరికల్చర్ కార్యాలయం, యూపీఎస్ పాఠశాల, గురుకుల పాఠశాల వంటి ప్రభుత్వ సంస్థలు ఉన్నందున ప్రతిరోజూ విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామ ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. బస్సులు ఆగకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఉదయం వేళల్లో ఎక్స్‌ప్రెస్ బస్సులకు కూడా లింగారెడ్డిగూడలో స్టాప్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.డిపో మేనేజర్ సానుకూలంగా స్పందిస్తూ, పల్లె వెలుగు బస్సులు స్టాప్ వద్ద ఆగని సందర్భాలను తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంసీ ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ ఎర్రోళ్ల అశోక్, సింగిల్ విండో డైరెక్టర్ సందుగారి లక్ష్మీకాంత్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ ఫరూక్‌నగర్ మండల అధ్యక్షుడు రంగంపల్లి రమేష్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ సందుగారి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రంగంపల్లి సురేష్ గౌడ్, గ్రామస్తులు, యువ నాయకులు రంగంపల్లి శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..