తెలంగాణ

చాకలి ఐలమ్మ ఆశయాలు స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ ఆశయాలు స్ఫూర్తిదాయకం

సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయం

– రాష్ట్ర బీసీ నాయకులు, జర్నలిస్టు తెల్ల హరికృష్ణ

పయనించే సూర్యుడు న్యూస్, సెప్టెంబర్ 26: తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి కైతలాపూర్‌లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను కైతలాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రజక సంఘం నాయకులు సుందర్ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ నాయకులు, జర్నలిస్టు తెల్ల హరికృష్ణ హాజరై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్ పాల్గొని నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేసిందని పేర్కొన్నారు.అన్యాయాన్ని ఎదిరించి, ఆత్మగౌరవం కోసం నిలబడిన చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, గౌరవం లభించేలా కృషి చేయడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, స్థానిక నాయకులు అవినాష్, శ్రీకాంత్‌తో పాటు పలువురు నాయకులు, సంఘం సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS