సినిమా వార్తలు

సరస్వతీ దేవి అవతారంలో కనకాపూర్ గ్రామంలో శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు

సరస్వతీ దేవి అవతారంలో కనకాపూర్ గ్రామంలో శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి అనుగ్రహం కోసం తరలివస్తున్న భక్తజనంలోకేశ్వరం, మండలం కనకాపూర్ గ్రామంలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు కొలువుదీరారు.అమ్మవారిని వివిధ రకాల సుగంధ పుష్పాలు, పూలమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారి దివ్య అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేక పూజలు, అర్చనలతో ఆలయంలో భక్తిమయ వాతావరణం నెలకొంది.అమ్మవారిని దర్శించుకునేందుకు కనకాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ,తమ కుటుంబాలపై అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నారు.*విద్యాబుద్ధులు ప్రసాదించే వాగ్దేవిగా శ్రీ సరస్వతీ దేవి!*జ్ఞానానికి, విద్యకు, వాక్చాతుర్యానికి ప్రతీకగా పూజలందుకునే శ్రీ సరస్వతీ దేవి అనుగ్రహంతో విద్యార్థులకు విద్యాభివృద్ధి, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయు రారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో జ్ఞానజ్యోతులు వెలగాలని, సకల శుభాలు చేకూరాలని భక్తులు కోరుకుంటున్నారు.శరన్నవరాత్రి ఉత్సవాలతో కనకాపూర్ గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS