పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం, ఏపీ హెచ్ బి కాలనీ 4వ ఫేస్ వాసులు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఇక్కడి స్థానికుల పట్ల ప్రభుత్వం, అధికారుల వైఖరి ఎందుకు ఇంత చిన్నచూపుగా ఉందంటూ జనసేన నాయకులు కొల్లా శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.నిర్వీర్యంగా మారిన పార్కులు మొక్కలు పెరిగి, చెత్తాచెదారంతో పార్కులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి,భయాందోళన కలిగిస్తున్న పాముల బెడద, కాలనీలో సరైన పారిశుద్ధ్యం లేకపోవడం, పిచ్చిమొక్కలు పెరగడంతో పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. రాత్రి సమయాల్లోనే కాకుండా పగటిపూట కూడా పాములు సంచరిస్తుండటంతో చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.తాగుబోతులకు అడ్డాగా మారిన 4 ఫేస్ పార్కులు : రాత్రి వేళల్లో యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు గంజాయి, మద్యం విచ్చలవిడిగా సేవిస్తూ స్థానికులను, మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నా పట్టించుకునే వారే లేరు.రాత్రివేళల్లో పోలీసు గస్తీ పెంచాలని తెలియజేసారు .తక్షణమే కెపిహెచ్బి 4వ ఫేస్ కాలనీ వాసుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆళ్ల నరేంద్ర (అడ్వాకెట్ ) వీరామహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.