తెలంగాణ

కోనసీమ తిరుమలలో గాదె శివ దంపతుల ప్రత్యేక పూజలుకుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం.. ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు

కోనసీమ తిరుమలలో గాదె శివ దంపతుల ప్రత్యేక పూజలుకుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం.. ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు

పయనించే సూర్యుడు న్యూస్ | అక్టోబర్ 17 | తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జ్: శ్రీనివాస్ రెడ్డివాడపల్లి: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గాదె శివ, జ్యోతి దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఆలయానికి చేరుకున్న గాదె శివ దంపతులకు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు అందజేశారు. అనంతరం స్వామివారి కండువాతో ఆశీర్వదించి, తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని, సమాజం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని గాదె శివ మనస్ఫూర్తిగా ప్రార్థించారు.కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS