
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
దూసకల్ లో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు అక్టోబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) ప్రజల్లో భక్తుల్లో ఆధ్యాత్మిక భక్తి భావం సంతరించుకోగా శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరుక్ నగర్ మండలం దూసకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా ఆయన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ..సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనిత రఘునాథ్ యాదవ్,పోమాలపల్లి సర్పంచ్ స్వప్న భూపాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ మురళీధర్ రెడ్డి,కాంటెస్టెడ్ కౌన్సిలర్ రాజేందర్ సింగ్,మాజీ ఉప సర్పంచ్ వి.శివకుమార్ యాదవ్ నాయకులు భాగం కృష్ణయ్య, చౌలపల్లి కృష్ణా రెడ్డి, రాజు గౌడ్,కమ్మరి శ్రీను, శివ,కారే ప్రకాశ్, కారే గణేష్, కావాలి అశోక్, చాట్ల శివ, వెంకట్ రెడ్డి, భాగం కుమార్, వంశీ, విష్ణు వర్ధన్ రెడ్డి, కుమ్మరి రాజు, జయసింహ రెడ్డి, వంశీ,శరత్ తదితరులు పాల్గొన్నారు.