తెలంగాణ

ఆధ్యాత్మిక సేవలో ముందడుగు..

ఆధ్యాత్మిక సేవలో ముందడుగు..

శివాలయానికి రవీందర్ యాదవ్ లక్ష విరాళం

( పయనించే సూర్యుడు నవంబర్ 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలోని శివాలయ నిర్మాణ పనులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ తన వంతు సహకారం అందించారు. ఆలయ స్లాబ్ నిర్మాణం కోసం రూ.1,00,000 (లక్ష రూపాయలు) విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేతుల మీదుగా ఆలయ నిర్మాణ నిర్వాహకులకు అందించారు. ఈ సందర్భంగా గ్రామ బీఆర్ఎస్ నాయకులు రవీందర్ యాదవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆలయ అభివృద్ధికి నాయకులు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పల్లె నర్సింగ్ రావు, కంటెస్టెడ్ సర్పంచ్ ప్రేమ్ కుమార్ గౌడ్, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ధర్మకర్త యాదగిరి, దశరథ్, మన్సాని రవి, నల్లవోలు శ్రీనివాస్ రెడ్డి, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS