రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రంలోని బొప్పాపూర్, సులేమాన్ నగర్ గ్రామాలల్లో గురువారం మూడు నెలల లోపు దూడలకు ఉచిత నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ శిబిరంలో 70 దూడలకు ఉచిత నట్టల నివారణ మందులను వేయడం జరిగిందని పశు వైద్యులు డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ సుమలత కృష్ణ, సిబ్బంది సాయిరాజ్, పాషా, అటెండర్ గంగారాం, పశువుల పెంపకం దారులు, గ్రామస్తులు పాల్గొన్నారు