( పయనించే సూర్యుడు నవంబర్ 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ పట్టణంలో పరిగిరోడ్డులో అరుణ్ కుమార్, దుర్గేష్ ఏర్పాటు చేసిన మన చికెన్ మటన్ మార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ…మాంస ప్రియులకు ఎల్లప్పుడూ నాణ్యమైన,తాజా మరియు పరిశుభ్రమైన మాంసాన్ని అందించి వ్యాపారంలో కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించి వ్యాపారంలో విజయం సాధించాలని తెలుపుతూ, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనిత రఘునాథ్ యాదవ్,బి ఎస్ సుదీర్, వాని పాండురంగారెడ్డి,మాజీ కౌన్సిలర్లు కానుగు అనంతయ్య,చింటూ ప్రతాప్ రెడ్డి,పాలమాకుల చెన్నయ్య , నందకిషోర్ బీఆర్ఎస్ నాయకులు శ్రీపాల్ రెడ్డి,దినేష్ సాగర్,బషీర్,యాదగిరి,విష్ణువర్ధన్ రెడ్డి,నర్సింగ్,శంకర్,ప్రకాష్, మురళి,లడ్డు,మల్లేష్, సలీం ,బాలు,రమేష్,యాదన్న, ప్రవీణ్,చేన్నాజీ,మధు సుధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.