ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే అరెస్టులా? బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నరేందర్
జనవరి 14, పయనించే సూర్యుడు, బచ్చన్నపేట జనగామ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ అక్రమ అరెస్టుకు నిరసనగా మంగళ వారం జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కౌశిక్ రెడ్డి ని పరామర్శించడానికి వెళ్తున్న బచ్చన్నపేట బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు గంధమల్ల నరేందర్ మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేశారని పేర్కొన్నారు.పూటకో అక్రమ కేసు పెట్టడం రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారింది. రైతు రుణమాఫీని ఎగ్గొట్టి, దళిత బంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే ఈ అణచివేత చర్యలకు దిగుతున్నారు.పోరాటాలే ఊపిరిగా పుట్టిన గులాబీ పార్టీ నేతల ఆత్మ స్థయిర్యాన్ని ఇలాంటి చిల్లర చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ దెబ్బతీయలేదు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షులు ఎండి జావిద్, పార్టీ మండల నాయకులు బొమ్మేన సందీప్ గౌడ్, వడ్డేపల్లి యాకం రెడ్డి, తప్పెట్ల వినోద్ కుమార్ లను ముందస్తు అరెస్టు చేసినట్టు బచ్చన్నపేట మండల పోలీస్ వారు తెలిపారు.