పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 15 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు తొలితరం కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ మార్పు పద్మనాభము 59వ వర్ధంతి సభ కార్యక్రమం మంగళవారం పలాస కాశీబుగ్గ పాత బస్టాండ్ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు చాపర వేణుగోపాల్(సి.పి.ఐ)ఎన్. గణపతి(సిపిఎం) వి. మాధవరావు(న్యూ డెమోక్రసీ)టి. సన్యాసిరావు (లిబరేషన్) తదితరులు మాట్లాడుతూ మార్పు పద్మనాభం రైతాంగ ఉద్యమ వైతాళికుడు అని కొనియాడారు. పుల్లెల శ్యాంబాబు నాయకత్వాన రైతు ఉద్యమం ప్రారంభమైందనీ, ఆ రైతు ఉద్యమ కమిటీకి మార్పు కార్యదర్శిగా పనిచేశారని.తెలిపారు. అధిక శిస్తులకు వ్యతిరేకంగా, బ్రిటిష్ వారికి, జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినందుకు బళ్లారి జైల్లో మార్పు పద్మనాభంను బంధించారనీ, అక్కడ ఏ ఆర్ గోపాలన్ వంటి ప్రముఖ కమ్యూనిస్టు యోధులతో పరిచయముతో ఆయన కమ్యూనిస్టుగా మారారని తెలిపారు. హరిపురంలో హరిజనోద్యమ సభ కుల నిర్మూల లక్ష్యంతో ఏర్పాటు చేశారనీ, ఆయన యొక్క ఆశయాలకు కృషి చేయడమే మార్పు పద్మనాభంకు మనం ఇచ్చిన నివాలని అన్నారు ఈ కార్యక్రమంలో జుత్తు.వీరాస్వామి, అజయ్ కుమార్, మద్దిల. రామారావు, రవి ,వినోద్, సొర్ర.రామారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
కామ్రేడ్ మార్పు పద్మనాభం కు ఘన నివాళి అర్పించిన వామపక్ష పార్టీలు
RELATED ARTICLES