కూటమి గెలుపే లక్ష్యంగా వ్యూహరచన పయనించే సూర్యుడు నంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల ప్రచారం నగరంలో వేడెక్కిన నేపథ్యంలో రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు)ను టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల ప్రచార వ్యూహాలు, స్థానిక డివిజన్లలోని తాజా రాజకీయ సమీకరణాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. కూటమి మేయర్ అభ్యర్థి మరియు డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన ప్రచార కార్యక్రమాలపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మెట్ల రమణబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నగర అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని, మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకునేలా తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చారు. 52వ వార్డ్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి చిక్కాల రామ సీత ప్రచారంలో పాల్గొన్న కూటమి నాయకులు ఈ భేటీలో 33వ వార్డ్ కౌన్సిలర్ జంగా అబ్బాయి వెంకన్న, 28వ వార్డ్ కౌన్సిలర్ మోకా వెంకట సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, శ్రీ సుబ్బాల్లమ్మ దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి పుల్లయ్య నాయుడు, మీడియా ఇంఛార్జి గంధం శ్రీను, పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.