ఆంధ్రప్రదేశ్

నడవపల్లిలో గ్రంధి నానాజీకి ఏకగ్రీవ విజయం.. వార్డు ప్రజల సంపూర్ణ మద్దతు

నడవపల్లిలో గ్రంధి నానాజీకి ఏకగ్రీవ విజయం.. వార్డు ప్రజల సంపూర్ణ మద్దతు

పయనించే సూర్యుడు నవంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన
మండలం: నడవపల్లి గ్రామ పంచాయతీ 6వ వార్డు సభ్యునిగా భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ వార్డులోని ఓటర్లందరూ ఏకమై నానాజీకి మద్దతు ప్రకటించడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని నానాజీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ కన్వీనర్ గొల్ల కోటి వెంకట రెడ్డి, గ్రంధి నాని బాబు, మట్ట సూరిబాబు, మట్ట శివ, నంద్యాల చంటి, సుంకర నాగేశ్వరరావు, కూటమి నాయకులు గ్రంధి నానాజీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS