పయనించే సూర్యుడు ఆడ కూడా ఇచ్చిండు నెంబర్ నవంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బ్రహ్మసమేధ్యం: నా రాజకీయ ప్రయాణంలో నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 2013లో నేను సర్పంచ్‌గా పోటీ చేసినప్పుడు నా వెనుక నిలబడి, నా వెన్నుతట్టి ప్రోత్సహించిన నా కార్యకర్తలు, నా కుటుంబ సభ్యులు, నన్ను నమ్ముకున్న ప్రజల అభీష్టం మేరకు, వారి అభిప్రాయాలకు గౌరవం ఇస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్రామ శ్రేయస్సే మా ఎజెండా, గ్రామ అభివృద్ధే మా లక్ష్యం. ఈ నేపథ్యంలో బ్రహ్మసమేధ్యం సర్పంచ్ అభ్యర్థి తిరుమాని వరలక్ష్మి సత్తిబాబు గారికి మేము మద్దతు ఇవ్వడం జరిగింది. నా ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను నమ్ముకున్న ప్రజలకు ఒక మాట ఇస్తున్నాను, నేను ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. మీకు అండగా ఉంటాను. మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తాను. నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, నమ్మకానికి జీవితాంతం రుణపడి ఉంటాను. తిరుమాని వీరబాబు.