Wednesday, January 15, 2025
Homeతెలంగాణక్రీడాకారులు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

క్రీడాకారులు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

Listen to this article

కొందుర్గు మండలం బైరంపల్లి, ముట్పూర్, ఉమ్మెంత్యాల్, శ్రీ రంగాపూర్ గ్రామాలలో క్రికెట్ టోర్నమెంట్లు

క్రికెట్ టోర్నమెంట్లు ప్రారంభించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

( పయనించే సూర్యుడు జనవరి 14 రిపోర్టర్ పిరు నాయక్ )

క్రీడాకారులందరికి మొదటగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. కొందుర్గు మండలంలోని భైరంపల్లి, ఉమ్మెంత్యాల, ముట్పూర్, శ్రీ రంగాపూర్ గ్రామాల్లో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లను ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యేలను నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. అనంతరము ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ క్రీడలలో పట్టు సాధించడానికి కొంతమందికి అవకాశం ఉంటుందని, అందరికీ క్రీడల్లో పాల్గొనాలని ఉన్న కొద్దిమందినే అదృష్టం వరిస్తుందని ప్రారంభోత్సవ సందర్భంగా తెలిపారు. కొద్ది మంది మాత్రమే క్రీడలపై ప్రేమ పెంచుకొని క్రీడలని తమ జీవిత ధ్యేయంగా భావించి ఆడడం వల్లనే అత్యున్నత స్థాయికి వెళ్తారని అన్నారు. మనిషి సాధించాలనుకుంటే కానిదేది లేదన్నట్లు క్రీడాకారులుగా క్రీడలపై ఇష్టం పెంచుకొని ఆడితే గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయికి, రాష్ట్రస్థాయి నుండి జాతీయస్థాయికి, జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి రాణించవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారని, గ్రామీణ ప్రాంతాలలో క్రీడలపై మక్కువ పెంచుకుంటున్న క్రీడాకారులకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌదరి గూడ జెడ్పిటిసి స్వరూప రాములు, కొందుర్గు వైస్ ఎంపిపి రాజేష్ పటేల్ , కొందుర్గు జెడ్పిటిసి తనయుడు రామక్రిష్ణ, కొందుర్గు బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, బందు లాల్, మాదేవ్పూర్ రవిందర్ రెడ్డి, భైరం పల్లి మాజీ సర్పంచ్ ఆంజనేయులు, ముట్ పూర్ మాజీ సర్పంచ్ నర్సింహ రెడ్డి ఉపసర్పంచ్ యాదయ్య, ఉమెంతల్ మాజీ సర్పంచ్ నర్సిమ, మాదేవ్ పూర్ మాజీ సర్పంచ్ రామచేంద్రయ్య, అయోధ్య పూర్ మాజీ సర్పంచ్ గోపాల్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాజా రమేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు దర్గా రామచేంద్రయ్య, శ్రీరంగపూర్ రవిందర్ గౌడ్, శ్రీరంగపూర్ బి ఆర్ ఎస్ ప్రెసిడెంట్ ఎలందారి యాదయ్య, మరియు భైరంపల్లి బిఆర్ఎస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్,ముట్ పూర్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ వేణు, బిఆర్ఎస్ యువ నాయకులు ప్రవీణ్, క్రిష్ణ, శివ,ఆర్గనైసర్స్ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments