పయనించే సూర్యుడు న్యూస్: రామగిరి సెంటినారి కాలనీ :-భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి భవన నిర్మాణ కార్మికులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల జీవితాల్లో ఈ సంక్రాంతి పండుగ సుఖ సంతోషాలను నింపాలని, సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సాంస్కృతి సాంప్రదాయాలు పరిమళించే ఈ సంక్రాంతి ముగ్గులు గొబ్బెమ్మలతో ప్రతి ఇంట పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని సూచించారు. పండగ పూట పిల్లలు పతంగులు ఎరవేసే సమయంలో పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.